ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమే కారణం.. ఆమె గ్రూప్ పరీక్షకే హాజరవ్వలేదు

ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమే కారణం.. ఆమె గ్రూప్ పరీక్షకే హాజరవ్వలేదు

విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు. ప్రవల్లిక శివరాం రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించిందని..అయితే  అతనికి ఎంగేజ్ మెంట్ కావడంతో మనస్థాపానికి గురై ప్రవల్లిక సూసైడ్ చేసుకుందని వెల్లడించారు. ప్రవల్లిక తల్లిదండ్రులకు కూడా ఆమె ప్రేమ వ్యవహారం తెలుసని చెప్పారు. 

ప్రవల్లిక ఫోన్తో పాటు..సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నామని..ఆమె సెల్ ఫోన్ డేటాను రిట్రైవ్ చేసినట్లు చెప్పారు. ఇందులో శివరాం రాథోడ్తో చాటింగ్ను గుర్తించినట్లు తెలిపారు.  ప్రవల్లిక లవ్ సింబల్స్తో రాసిన లెటర్స్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 13న  ఉదయం అశోక్ నగర లోని బాలాజీ దర్శన్ హోటల్ లో  ఇద్దరు టిఫిన్ చేశారని..ఈ  సీసీ ఫుటేజ్ సీజ్ చేసినట్లు తెలిపారు.  ప్రవల్లిక లవ్ లెటర్, సీసీ కెమెరా ఫుటేజ్,  మొబైల్ ఫోన్ , సూసైడ్ నోట్ను  పూర్తి ఆధారాలకోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు  పంపామని చెప్పారు. 
 
ప్రవల్లిక ఆత్మహత్యను మరో ఇష్యూతో ముడిపెడుతున్నారని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అసలు ప్రవల్లిక ఏ గ్రూప్ ఎగ్జామ్కు హాజరవ్వలేదని స్పష్టం చేశారు. ప్రవల్లిక సూసైడ్  విద్యార్థులు, రాజకీయ నాయకులు ధర్నా చేశారని..ధర్నాతో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 

 ప్రవల్లికను శివరాం రాథోడ్  చీట్ చేశాడని..వేరే అమ్మాయితో శివరాం రాథోడ్  ఎంగేజ్ మెంట్ జరిగిందని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని..అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. లీగల్ ఒపినియన్ తర్వాత శివరాంపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. 
 

ALSO READ : IND vs PAK: భారత బౌలర్ల మాయాజాలం..191 పరుగులకే పాక్ ఆలౌట్