V6 News

చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో సస్పెండ్...

చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో సస్పెండ్...

చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే.రామాంజనేయులును సస్పెండ్ చేశారు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు. మంగళవారం ( ఏప్రిల్ 14 ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు గుర్తించిన కమిషనర్ ఈవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన లెక్కలు లేవని గుర్తించినట్లు తెలిపారు అధికారులు. 

స్వామివారికి సంబంధించి 2.30 కిలోల వెండి కిరీటానికి రసీదు ఇవ్వకపోవడం, కంసాలికి ఇచ్చిన కిరీటం 4 ఏళ్లుగా తిరిగి రాకపోవడంపై ప్రశ్నించిన భక్తుడికి ఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు.

అంతే కాకుండా..పులిహోర, లడ్డూ ప్రసాదం తక్కువ పరిమాణంలో ఇవ్వడం, ఆలయ అద్దె ఆదాయంపై లెక్కల నిర్వహణ లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.ఈవో రామాంజనేయులును సస్పెండ్ చేసిన కమిషనర్ అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.