హవాలా అంతా క్యాసినో గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనే

హవాలా అంతా క్యాసినో గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : చీకోటి ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుమార్​హవాలా నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అతడు నిర్వహించిన క్యాసినోల ద్వారా రూ.వందల కోట్లు చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. ఇండో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నేపాల్‌‌‌‌‌‌‌‌ బోర్డర్​లోని జాపాల్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో జరిగిన వెగాస్‌‌‌‌‌‌‌‌ బిగ్‌‌‌‌‌‌‌‌ డాడీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ దగ్గర్నుంచి చీకోటి ఆర్థిక మూలాల వరకు పూర్తి  డేటాను ఈడీ సేకరిస్తోంది. బస్తీల్లో పేకాట ఆడే ప్రవీణ్‌‌‌‌‌‌‌‌.. క్యాసినో, హవాలా ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా జరుపుతున్న ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌ దందాల వివరాలు రాబడుతోంది. చీకోటి ఫ్యామిలీ, ఆస్తుల వివరాలను సేకరిస్తోంది. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ నివాసం ఉండే సైదాబాద్‌‌‌‌‌‌‌‌ ఐఎస్‌‌‌‌‌‌‌‌ సదన్‌‌‌‌‌‌‌‌లో కీలక వివరాలు రాబట్టింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాధారాలను కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. గోవా, నేపాల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న క్యాసినోకు  పర్మిషన్లు ఎవరిచ్చారు, ఇన్వెస్టర్లు ఎవరు, క్యాష్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఎలా నిర్వహించారు వంటి అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో క్యాసినోతో లింకైన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా ఆయా బ్యాంకులకు లెటర్లు రాసినట్లు తెలిసింది. గోవా, నేపాల్‌‌‌‌‌‌‌‌లోని క్యాసినోలకు సంబంధించిన వివరాలను నాలుగు టీమ్​లు సేకరిస్తున్నట్లు సమాచారం.

6 నెలల్లో 7 గేమ్స్.. 
ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే ఏడు భారీ క్యాసినోలను చీకోటి నిర్వహించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌, గోవాలో  నిర్వహించిన క్యాసినోలో రూ.వందల కోట్లు చేతులు మారినట్లు ఈడీ భావిస్తున్నది. గోవా, నేపాల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన క్యాసినో వెగాస్‌‌‌‌‌‌‌‌ బై బిగ్‌‌‌‌‌‌‌‌బాడీతో సెంటర్లపై ఈడీ ప్రధానంగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. సంవత్సర కాలంలో  నాలుగు భారీ క్యాసినో ఈవెంట్స్ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సుమారు వెయ్యి మందిని విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించారని ఈడీ గుర్తించింది. క్యాసినోలో పాల్గొన్న కస్టమర్లు పెట్టిన బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌, గెలుచుకున్న క్యాష్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఎలాంటి లెక్కలు లేనట్లు గుర్తించింది. క్యాసినో ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌కి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫ్లైట్స్ ఎవరు బుక్‌‌‌‌‌‌‌‌ చేశారు, పేమెంట్స్ ఎలా జరిగాయో ఈడీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. 

ఫ్లైట్స్, టికెట్‌‌‌‌‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌తో ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌
ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌ డేట్లు, క్యాష్‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌, బుక్‌‌‌‌‌‌‌‌ చేసిన వారి వివరాలను ఈడీ ట్రాక్ చేస్తున్నట్లు తెలిసింది. కస్టమర్ల ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌, క్యాసినో ఎంట్రీ ఫీజు, అకామడేషన్​డేటాను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. ఇందులో భారీగా హవాలా అమౌంట్‌‌‌‌‌‌‌‌ చేతులు మారినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రెండేండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని బ్యాంక్ అధికారులను ఈడీ కోరింది. క్యాసినో హవాలా ఏజెంట్లు సంపత్‌‌‌‌‌‌‌‌, రాజేశ్, వెంకటేశ్, బబ్లూలకు నోటీసులు ఇచ్చింది. సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన డాక్యుమెంట్లతో వివరణ ఇవ్వాలని సూచించింది.