మీడియా సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నయ్

మీడియా సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నయ్

క్యాసినో హవాలా కేసులో విచారణలో భాగంగా చికోటి ప్రవీణ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డిలి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ సందర్భంగా తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చికోటి మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో అగంతకులు నకిలీ ఖాతాలు తెరిచారని ఆరోపించారు. నకిలి ఖాతా పేరుతో పోస్టులు చేస్తున్న అగంతకులపై ఇప్పటికే సీసీఎస్ లో ఫిర్యాదు చేశానన్నారు. మీడియా సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని మీడియాని కోరుతున్నానన్నారు. మాధవరెడ్డి హాజరుపై నాకు సమాచారం లేదన్న చికోటి... అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా సంచలనం స-ృష్టిస్తోంది. క్యాసినో పాటు హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే చికోటి నుంచి ల్యాప్ ట్యాప్, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.