నాలుగో రోజు విచారణకు హాజరుకానున్న చికోటి ప్రవీణ్ కుమార్

నాలుగో రోజు విచారణకు హాజరుకానున్న చికోటి ప్రవీణ్ కుమార్

క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటీ ప్రవీణ్ కుమార్ పై ఈడీ విచారణ నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడు రోజుల పాటు సుధీర్ఘంగా విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. నేడు మరోసారి హాజరు కావాలని ఆదేశించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇటీవలే కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అంతే కాకుండా పలు దేశాల్లోనూ చికోటి క్యాసినో క్యాంపులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చికోటి ప్రవీణ్ తో పాటు, మాధవరెడ్డిలను కూడా ఈడీ ప్రశ్నిస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా  సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, పోస్ట్ లు చేస్తున్నారని ఇటీవలే చికోటి ప్రవీణ్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన పేరు మీద నకిలీ ఖాతా క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  తన పేరును కించ పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని, వెంటనే వారిని గుర్తించాలని చికోటి ప్రవీణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.