రాజాసింగ్ ఇంటికి ర్యాలీగా వెళ్లనున్న చికోటి

రాజాసింగ్ ఇంటికి ర్యాలీగా వెళ్లనున్న చికోటి

హైదరాబాద్ లోని కోఠి ఇసామియా బజార్ లోని సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి చికోటి ర్యాలీగా వెళ్లనున్నట్టు సమాచారం. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మొన్నటివరకూ జైల్లో ఉన్న రాజాసింగ్ కు హైకోర్టు ఊరట కల్పించింది. పీడీ చట్టం కింద ప్రభుత్వం ఆయనకు విధించిన ఏడాది నిర్భందాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘జైలు నుంచి బయటికి వెళ్లేప్పుడు ర్యాలీలు నిర్వహించవద్దన్న కొర్టు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది. కోర్టు బెయిల్‌ మంజూరు చేయగానే రాజాసింగ్‌ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్‌ ఆర్డర్‌ ఆన్‌లైన్‌ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్‌ను విడుదల చేశారు.

క్యాసినో గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ చుట్టూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. సైదాబాద్ IS సదన్ లోని ప్రవీణ్ ఇంటితో పాటు బోయినపల్లిలోని అతడి పార్ట్ నర్ మాధవరెడ్డి ఇంట్లో ఇప్పటికే  కీలక ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ ల్యాప్ టాప్ లో ప్రముఖుల వివరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మంత్రులతో ప్రవీణ్ కు ఆర్ధిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. చికోటి క్యాసినో నెట్ వర్క్ లో 18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.