
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసిపాప ప్రాణాన్ని తీసింది. ఆ చిన్నారిని చూసుకోకుండా బండి నడపడంతో టైర్ల కింద పడి ఆ బాలిక(మారుయం) మృతి చెందింది. ఈ విషాద సంఘటన పాతబస్తీలో జరిగింది. ఈ విషయంపై సమాచారమందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాప మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.