పిల్లలు మంచిగుంటే పంచాయతీకి అవార్డ్

పిల్లలు మంచిగుంటే పంచాయతీకి అవార్డ్

పిల్లలు హెల్దీగా ఉన్నరా? మంచి గ స్కూల్‌కు పోతరా? అందరూ టీకాలుతీసుకున్నరా? అయితే మీ పంచాయతీకి అవార్డువ చ్చేసినట్టే! పిల్లల బాగోగులు, యోగక్షేమాలు, ఆరో-గ్యం గా ఎదగడం వంటి అంశాలను పరిగణనలోకితీసుకొని కేంద్రం ఏటా ఓ అవార్డు ఇవ్వనుంది. దీనికి‘చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’గా పేరు పెట్టిం ది. ఈ ఏడాదిఏప్రిల్ 24 పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భం గాకేంద్ర గ్రా మీణ అభివృద్ధి శాఖ ఈ అవార్డును ప్రదానం చేయనుంది. లోక్ సభ కోడ్ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని జూన్ లో నిర్వహించనున్నారు. ఈ అవార్డుకు 2016–17, 2017–18 సంవత్సరాల పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. మార్చి 31 కల్లా ప్రతి రాష్ట్రం నుంచి మూడు పంచాయతీల పేర్లు పంపాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ భట్నాగర్ ఇటీవల అన్నిరాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాయగా మన రాష్ట్రం నుంచి పంచాయతీల పేర్లు పంపినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను నేషనల్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఈఅవార్డుకు ఎంపికైన పంచాయతీ పేరును వెల్లడించనుంది. దీనికింద రూ.5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.

ప్రస్తుతం మూడు అవార్డులు

కేంద్రం ఏటా గ్రామాలకు మూడు అవార్డులు అందజేస్తోంది. ఇప్పుడు ప్రవేశపెట్టింది నాలుగోది.పంచాయతీ సశక్తికరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్గ్రామ సభ పురస్కార్ , గ్రామ పంచాయతీ ప్రణాళికపేరుతో నగదు బహుమతులను అందజేస్తూ ప్రోత్సహిస్తోంది. పారిశుధ్యం , మౌలిక సదుపాయాలు,గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో ఈ అవార్డులుఇస్తోంది. వీటి అమలుకు కేంద్రం నిధులు విడుదలచేస్తోంది. రాష్ట్రంలో గతేడాది జూలై వరకు 8,371పంచాయతీలు ఉండగా ఆగస్టు నుంచి మరో 4,380అమల్లో కి వచ్చాయి.

8 అంశాల ఆధారంగా అవార్డు

పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించటం, టీచర్లహాజరు, స్కూళ్లలో పిల్లల సంఖ్య, మధ్యలో చదువుమానేసే పిల్లల సంఖ్యను తగ్గిం చడం, పంచాయతీల్లోబయట మలమూత్ర విసర్జన లేకుండా చూడడం,బాలికల్లో పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకంఅమలు, పిల్లలకు పోషకాహారం.