రేవల్లి, వెలుగు: నాగపూర్‌కు చెందిన మానుపాడు లహరి, హర్షిణి అనే చిన్నారులు వీ6 వెలుగుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. న్యూ ఇయర్సందర్భంగా గురువారం తమ ఇంటి ఎదుట వీ6 వెలుగు లోగోను రంగులతో అందంగా తీర్చిదిద్దారు. తమ ఇంట్లో ప్రతీరోజు రాత్రి 9.30 గంటలకు వచ్చే తీన్మార్ వార్తలను కుటుంబసభ్యులతో కలిసి చూస్తామని తెలిపారు. స్థానికులు వారిని అభినందించారు.
