గాంధీ భవన్ పటేల్ నగర్ లో విద్యుత్ షాక్ కొట్టి చిన్నారులకు గాయాలు

 గాంధీ భవన్ పటేల్ నగర్ లో విద్యుత్ షాక్ కొట్టి  చిన్నారులకు గాయాలు

బషీర్ బాగ్, వెలుగు: ఆడుకొనేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బేగంబజార్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం గాంధీ భవన్ వెనక పటేల్ నగర్ లోని సులభ్ కాంప్లెక్స్ దాబాపైన అదే ప్రాంతానికి చెందిన రెహమన్(13), జాహేద్(12) ఆడుకునేందుకు వెళ్లారు.

 కొద్దిసేపటికి కిందకు దిగి వస్తుండగా, పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయారు. స్థానికులు చూసి వెంటనే హాస్పిటల్ కు తరలించి, పోలీసులకు తెలిపారు. రెహమాన్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు ఉస్మానియా డాక్టర్లు తెలిపారు.