సర్పంచ్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి

సర్పంచ్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు మంగళవారం మక్తల్ లో మంత్రి శ్రీహరిని కలిశారు. 

ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు మెంబర్లను మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను తన దృష్టి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 

గ్రామాల్లోని డ్రైనేజీలు, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. మక్తల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.