- డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
ఎన్నికల్లో ప్రజలు ఆదరించడంతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందినట్లు తెలిపారు. మూడో విడత ఎన్నికల్లో కూడా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలు చేయలేదన్నారు. పార్టీ పరంగా జనరల్ సీట్లలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ మాట్లాడుతూ బిహార్లో ఆయూష్ సర్టిఫికెట్ల పంపిణీలో సీఎం నితీష్ కుమార్ ఓ ముస్లిం మహిళ హిజాబ్ ను తీసివేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసం కాదని, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
