వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మే 13న పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కరీంనగర్ చిగురుమామిడికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రెండు రోజుల (మే 13) క్రితం ఆసుపత్రి దగ్గర ఆందోళన చేపట్టారు.

కానీ ఇప్పటివరకు వైద్యులు పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం జరిగే వరకు నిరసనను కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. నవజాత శిశువు తల్లిదండ్రులు, వారి బంధువులతో కలిసి మరోసారి కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కుటుంబీకుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.