వాతావరణ మార్పులతో పిల్లలకు వైరల్ ఫీవర్స్

వాతావరణ మార్పులతో పిల్లలకు వైరల్ ఫీవర్స్

వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్‭తో జనం ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం నుంచి వేసవి కాలంలోకి మారే సమయంలో ఉదయం ఎండ, రాత్రి చలిగా ఉండటంతో పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. పీహెచ్సీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోని పిల్లల వార్డులన్నీ జ్వరం వచ్చిన చిన్నారులతో నిండిపోతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

నెల రోజులుగా జ్వరం వచ్చిన పిల్లలు సంఖ్య పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గకముందే.. మరొకరికి వ్యాపిస్తోంది. దీంతో పిల్లలతో పాటు కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో మార్పుల వల్లే  పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయంటున్నారు. చిన్నారులు బయటి ఫుడ్ తినకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.