
వరంగల్ అర్బన్ జిల్లా : హన్మకొండలో రేపిస్ట్ ప్రవీణ్ చేతిలో బలైపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన పూజారి రంగరాజన్. దురదృష్ట సంఘటన సందర్భంగా వరంగల్ రావడం బాధ కలిగిస్తోందన్నారు. ఓ రాక్షసుడి చేతిలో చిన్నారి చనిపోయిందనీ.. అలాంటి రాక్షసులను రేపాసురుడు అనాలని ఆయన చెప్పారు. ఇలాంటి రేపాసురులకు చట్టం అన్నా, ప్రజాస్వామ్య అన్నా భయం ఉండదనీ… చిన్నారులను చెరిచే రేపాసురులను నరకాలి… ఉరితీయాలని ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఇలాంటి వారి కోసం జెటాయువు సైన్యం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్క పౌరునిలో ఒక జటాయువు లక్షణాలు ఉండాలన్నారు. చట్టం కఠినంగా ఉంటేనే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చిలుకూరు బాలాజీ దేవస్థానంలో కన్యావందనం, రక్షాబంధనం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.