ఫిలిప్పీన్స్​ నేవీ షిప్​పై చైనా లేజర్ ​దాడి

ఫిలిప్పీన్స్​ నేవీ షిప్​పై చైనా లేజర్ ​దాడి

మనీలా: దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం ఆగడాలపై ఫిలిప్పీన్స్​ విరుచుకుపడింది. చైనా కోస్ట్​ గార్డ్​ దళం తమ దేశ కోస్ట్​ గార్డ్​ పెట్రోలింగ్​ నౌకపై లేజర్​ దాడి చేసిందని ఆరోపించింది. ఈ దాడిలో నౌకను నడిపే సిబ్బంది కళ్లపై ఎఫెక్ట్​ పడి..  కాసేపటి వరకు వారికి ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ప్రమాద కరమైన మిలటరీ లేజర్​తో రెండుసార్లు దాడి చేసిన వెంటనే చైనా కోస్ట్​ గార్డ్​ నౌక కవ్వింపునకు పాల్పడుతూ.. తమ నౌకకు 137 మీటర్ల దగ్గరికి వచ్చి వెళ్లింద ని పేర్కొంది.  ఫిలిప్పీన్స్ సమీపంలోని దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అయున్​గిన్​ షావోల్​ దీవి వద్ద ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగిందని ఫిలిప్పీన్​ ప్రభుత్వం వెల్లడించింది. అయున్​గిన్​ షావోల్​ దీవి తమదేనని చైనా వాదిస్తోంది. గతేడాది ఆగస్టులోనూ ఈ దీవికి సమీపంలోకి ఫిలిప్పీన్స్​ నేవీ పెట్రోలింగ్​ షిప్​ను రానివ్వకుండా చైనా సైన్యం అడ్డుకోవడంతో సైనిక ఉద్రిక్తత ఏర్పడింది.