అమెరికాతో ప్రస్తుతం నెలకొన్న టారిఫ్ గందరగోళం భారతదేశానికి సవాళ్లను కలిగిస్తోంది. అయితే, మన దేశానికి అమెరికాతో సరిహద్దు లేదా రిసోర్సెస్ వివాదం లేదు. కానీ, ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్ అమెరికా వివిధ కారణాల వల్ల భారతదేశాన్ని శత్రు వైఖరితో ఎదుర్కోవడానికి మొగ్గు చూపుతోంది. దీంతో భారతదేశం అకస్మాత్తుగా అమెరికా నుంచి సవాలును ఎదుర్కొంటోంది. అయితే, మనకు ఇక్కడ సమస్య అమెరికా గురించి కాదు. భారతదేశం చైనాతో స్నేహం కొనసాగించగలదా అనేది చర్చనీయాంశంగా మారింది.
భారతదేశం చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకుంది. ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే పురాతన నియమం ఇప్పటికీ అమలులో ఉన్నందున ఇది లాజికల్‌గా మారింది. వాస్తవానికి, పాకిస్తాన్, చైనా రెండూ భారతదేశానికి శత్రువులు కాబట్టి అవి అత్యంత సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉన్నాయి. 63 సంవత్సరాల నుంచి చైనా భారత్‌కు ప్రాణాంతక శత్రువుగా ఉందని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఇప్పుడు చైనాతో శత్రుత్వాన్ని తగ్గించుకుని కొనసాగలాదా అనేది ప్రశ్న?
భారత్‌తో చైనాకు సమస్యలు
- 1. చైనా భారతదేశంతో 3,500 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఈనేపథ్యంలో 1962 నుంచి యుద్ధ తరహా పరిస్థితి నెలకొంది. చైనా 1951లో టిబెట్‌ను ఆక్రమించినప్పుడే మన పొరుగు దేశం శత్రుదేశంగా మారింది. అప్పటి నుంచి భారతదేశం చైనాతో పూర్తిస్థాయి శత్రుత్వాన్ని ఎదుర్కొంటోంది.
 - 2. భారతదేశాన్ని తనకు అతిపెద్ద ముప్పుగా చైనా భావిస్తోంది. యుద్ధాల ద్వారా భారతదేశాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల కుట్రల ద్వారా ప్రయత్నించింది, పాకిస్తాన్‌ను భారతదేశంతో పోరాడటానికి ప్రోత్సహిస్తోంది. భారతదేశ పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌కు భారతదేశం పట్ల శత్రుత్వ వైఖరి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
 - 3. చైనా తన సరిహద్దులో ఉన్న భారత భూభాగాలను కోరుకుంటోంది. 1971కి ముందు అది విస్తారమైన ప్రాంతాలను ఆక్రమించింది. చైనా చారిత్రాత్మకంగా తన పొరుగువారికి నిరంతర శత్రువుగా కొనసాగుతోంది.
 - 4. భారతదేశంలోని పెద్ద నదులైన బ్రహ్మపుత్ర, సింధు కూడా టిబెట్‌లో ఉద్భవించాయి. చైనాతో ఇప్పటికీ మనకు వివాదాలు ఉన్నాయి.
 - 5. హిందూ మహాసముద్రంలో, ఐక్యరాజ్యసమితిలో, ప్రతిచోటా భారతదేశానికి చైనాతో సమస్యలు ఉన్నాయి.
 
చైనా స్నేహానికి భారతదేశం
భారతదేశం తన విధానాలను  పూర్తిగా  మార్చుకుని,  చైనాతో  నిజమైన  స్నేహితుడిగా  మారడానికి  చైనాకు భారీ రాయితీలు ఇవ్వాలి.   సరిహద్దు  భూ వివాదాలపై  భారతదేశం  వెంటనే మినహాయింపులు ఇవ్వాలి.  ‘చైనా ఆసియాకు ఎదురులేని లీడర్’ అని కూడా అంగీకరించాలి.  అదేవిధంగా  భారతదేశం  పాకిస్తాన్‌తో  కూడా పెద్ద ఎత్తున సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది.  విదేశీ  సంబంధాలలో ఏదైనా సాధ్యమే. కానీ, భారతదేశం ఆ మూల్యం చెల్లించడానికి  
అంగీకరించకపోవచ్చు.  అయితే,  మంచి రాజకీయాల విషయంలో  భారతదేశం అంతర్జాతీయ సంబంధాలలో  ఫ్లెక్సిబిలిటీని  చూపించాలి.  డిప్లొమసీలో  ఫ్లెక్సిబిలిటీని  చూపించడం ద్వారా  భారతదేశం ఇతర శత్రువులను, ప్రత్యర్థులను  షాక్‌కు గురిచేస్తుంది. 
భారతదేశం చైనాతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఆర్థిక, వాణిజ్య యుద్ధాలను ఎదుర్కోవడానికి భారతదేశం చైనాతో జత కడుతుందని అమెరికా నాయకులు ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. 63 సంవత్సరాలుగా ఇరుదేశాలు శత్రువులుగా ఉన్నందున భారతదేశం చైనాతో ఎప్పుడూ స్నేహం కోరుకోదని మాత్రమే అమెరికా నాయకులు ఊహించి ఉండవచ్చు. కానీ, భారతదేశం అవలంబించిన అనూహ్య చర్యలు శత్రు దేశాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. దౌత్యంలో అన్ప్రెడిక్ట్బిలిటీ, ఫ్లెక్సిబిలిటీ గొప్ప ఆయుధాలు అనేది ఒక నియమం.
చైనా ఏం చేయగలదు?
- భారతదేశంతో తమకు శాశ్వత శత్రుత్వం ఉందని చైనాకు తెలుసు. కానీ, భారతదేశంతో కలిసి పనిచేయడంలో చైనా కూడా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తోంది.
 - ఎ. అమెరికా, యూరప్ తమ పెరుగుదలను
 - నియంత్రించాలని భావిస్తున్నట్టు చైనాకు తెలుసు. ఒకవేళ భారతదేశం అమెరికా, యూరప్‌తో కలిసి ముందుకు వెళితే చైనాకు అది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి, భారతదేశం అమెరికా, యూరప్‌తో తన పోరాటంలో తటస్థంగా ఉంటే చైనా లాభపడుతుంది.
 - బి. చైనాకు యూరప్, అమెరికాతో శత్రుత్వం కలిగి ఉన్నప్పటికీ, వారు తమ ఆర్థిక వ్యవస్థల కోసం చైనాపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. అమెరికా, యూరప్ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ, వారు చైనా పెరుగుదలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. భారతదేశం తగ్గినప్పటికీ- భారత్‌తో ఉన్న శత్రుత్వం చైనాకు సహాయపడుతుంది. చైనా భారతదేశాన్ని బహిరంగంగా స్వాగతిస్తుంది. అయితే, దాని స్నేహానికి పరిమితులు ఉంటాయి.
 - సి. చైనా తక్షణ సమస్య ఏమిటంటే వాణిజ్యంపై అమెరికాతో మంచి ఒప్పందం అవసరం. భారతదేశంతో బహిరంగంగా స్నేహపూర్వకంగా వ్యవహరించడం ద్వారా, చైనా భారతదేశంతో జట్టుగా ఏర్పడగలదని అమెరికాకు పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సవాలుగా పంపుతుంది. ఆ హెచ్చరిక అమెరికా, యూరప్, జపాన్, ఇతర చైనా వ్యతిరేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
 - డి. చైనా భారతదేశానికి సహాయం చేస్తుందా లేదా అనేది సమస్య కాదు. కానీ, వెంటనే చైనా భారతదేశాన్ని ఉపయోగించి అమెరికా, యూరప్‌లను బెదిరిస్తుంది.
 - ఇ. 1959 నుంచి భారతదేశంలో ఉంటున్న దలైలామా చైనాకు గొప్ప ముప్పు అని చైనా కూడా భయపడుతోంది. భారతదేశంతో స్నేహంగా ఉండటం ద్వారా దలైలామా చైనాకు హానిచేయని వ్యక్తి అవుతాడు.
 - ఎఫ్. భారతదేశం చైనాకు సన్నిహితంగా మారితే పాకిస్తాన్ బాధపడకుండా చైనా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
 
భారతదేశానికి పాఠాలు
- ఎ. ‘దేశాల మధ్య శాశ్వత స్నేహితులు లేదా శాశ్వత శత్రువులు ఉండరు’ అని భారతదేశం గుర్తుంచుకోవాలి. అందరితో స్నేహం చేయడానికి మనం దౌత్యాన్ని ఉపయోగించాలి.
 - బి. మనం శక్తిమంతమైన దేశంగా మారామని భారతదేశం నిరంతరం గొప్పలు చెప్పుకోకూడదు. అది ఇతరులలో అసూయ, ఆందోళనలను సృష్టిస్తుంది. ప్రజల మాదిరిగానే దేశాలు కూడా రహస్యంగా ఎదగాలి. 1989 నుంచి చైనాను ఆధునీకరించిన గొప్ప చైనా నాయకుడు డెంగ్ హ్సియో లింగ్ చెప్పినట్టు ‘మీ బలాన్ని దాచిపెట్టి, మీ సమయాన్ని వెచ్చించాలి’.
 - భారతదేశం ఆ విజ్డమ్‌ను మరచిపోయింది.
 - సి. భారతదేశం చైనాతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. కానీ, సైనికపరంగా, భారతదేశం మరింత బలంగా మారాలి.
 - డి. అమెరికాతో బాగా బేరసారాలు చేయడానికి చైనా భారతదేశాన్ని ఉపయోగించుకోవచ్చు. చైనా నుంచి ఎదురయ్యే నిరాశలను ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉండాలి.
 
భారత్‌కు ‘థింక్‌ట్యాంక్’లు అవసరం
ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు విదేశాంగ, ఆర్థిక విధానాలను సమర్థవంతంగా రూపొందించడానికి, నిరంతరం వ్యూహరచన చేయడానికి భారతదేశానికి మరిన్ని ‘థింక్ ట్యాంక్‌లు’, నిపుణుల అవసరం ఉంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు కేవలం మన విదేశాంగ మంత్రిత్వ శాఖపై ఆధారపడితే సరిపోదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై  శత్రుత్వం వహిస్తారని మన విదేశాంగ మంత్రిత్వశాఖ ఎప్పుడూ ఊహించలేదు.  కచ్చితంగా అది పెద్ద వైఫల్యం.  భారతదేశం  దౌత్య చర్యలు  శత్రు దేశాలకు  భారతదేశం తన విధానాలను మార్చుకుంటుందని   సందేశాన్ని పంపుతాయి.  కానీ,  
దీర్ఘకాలంలో     భారతదేశం     అమెరికా,     యూరప్‌తో  మంచి సంబంధాలను కొనసాగించేలా చూసుకోవాలి.  ఇక ఇప్పుడు  చైనా  ఏం చేస్తుందో మనం వేచి చూడాలి.  ఇది చైనాకు కూడా గొప్ప సవాలు.  చైనా భారతదేశంతో స్నేహం చేయగలదా? అది  చైనాపై ఆధారపడి ఉంటుంది. ఇది చైనాకు ఒక చారిత్రక అవకాశం.  చైనాకు దూరదృష్టి ఉందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
అమెరికా, యూరప్‌లకు చైనా తాజా సవాలు!
2013లో జిన్ పింగ్ చైనా అధ్యక్షుడైనప్పుడు ‘చైనా దేశ గొప్ప పునరుజ్జీవనం అనే చైనీస్ కల’ను తాను సాకారం చేస్తానని అన్నారు. జిన్ పింగ్ చైనాను సూపర్ పవర్‌గా మార్చాలనుకుంటున్నారు. సెప్టెంబర్ 3, 2025న చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించడానికి బీజింగ్‌లో ఒక గొప్ప సైనిక కవాతును నిర్వహిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు దీనికి హాజరవుతున్నారు. సెప్టెంబర్ 3న జరగనున్న ఈ సైనిక కవాతు అమెరికా, యూరప్‌లకు వారి ఆధిపత్యం ముగిసిందని ఒక గొప్ప హెచ్చరిక. అయితే, యూరప్, అమెరికా భారతదేశాన్ని తమ నుంచి దూరం చేసుకున్నాయని గ్రహించే ఈ సంకేతం భారతదేశానికి సహాయపడుతుంది.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్-
