ఇంక చాలు : చైనా అక్రమంగా 38వేల స్వైర్ కిలో మీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది

ఇంక చాలు : చైనా అక్రమంగా 38వేల స్వైర్ కిలో మీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది

చైనా అక్రమంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సమావేశం సందర్భంగా రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ భారత్ భూభాగమైన లడఖ్ లో చైనా అక్రమ చొరబాట్లకు పాల్పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు లడఖ్ లో సుమారు 38వేల స్వైర్ కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందని మండిపడ్డారు.

చైనా సైతం అరుణాచల్ ప్రదేశ్ లోని ఇండియా – చైనా సరిహద్దు ప్రాంతమైన ఈస్ట్రన్ సెక్టార్ లో 90వేల స్క్రైర్ యార్డ్ భూభాగం తమదేనని చెప్పడాన్నితప్పుబట్టారు.

దాయాది దేశం 1963లో సీనో – పాకిస్తాన్ సరిహద్దు ఒప్పొందాన్ని ఉల్లంఘించిందని, పాక్..భారత భూభాగమైన పీఓకేలో సుమారు 5,180స్వైర్ యార్డ్స్ ను ఆక్రమించిందని రాజ్ నాధ్ వెల్లడించారు.

అంతేకాదు చైనా అక్రమ చొరబాట్లకు ప్రయత్నించడంతో దివంగత కల్నల్ సంతోష్ బాబు తో పాటు 19మంది సైనికులు వీరమణం పొందారని గుర్తుచేశారు.

ఈ ఘటన అనంతరం దేశ సైనికుల భద్రత, దైర్యాన్ని నింపేదుకు ప్రధాని మోడీ లడఖ్ ను సందర్శించిన విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పార్లమెంట్ లో ప్రసంగించారు.