చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీ: క్వార్టర్స్లో శ్రీకాంత్

 చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీ: క్వార్టర్స్లో శ్రీకాంత్

షెంజెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో అద్భుత విజయం సాధించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–18, 21–19తో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై గెలిచి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. 43 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇద్దరు ప్లేయర్లు బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలు ఆడటంతో రెండు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూ హోరాహోరీగా సాగాయి. కానీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద మెరుగైన డ్రాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన శ్రీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్వీ శర్మ 17–21, 21–18, 16–21తో టోమోకా మియాజాకి (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడింది.

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి 21–17, 22–24, 21–9తో క్రిస్టో పొపోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టోమా జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొపోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచి ముందంజ వేశారు. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సులభంగా గెలుచుకున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి షాట్లకు తడబడింది.

అయితే డిసైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యూహాత్మకంగా ఆడి పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపిల–తానీషా క్రాస్టో 18–21, 18–21తో లియు కుయాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సు యిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో పోరాడి ఓడారు.