న్యూఢిల్లీ: డెహ్రాడూన్ టీ20 లీగ్ కోసం ‘డోయివాలా కింగ్స్’ జట్టును ప్రకటించారు. టీఎన్‌ఆర్ మోహిత్‌ను కెప్టెన్‌గా, దివ్యాన్షు యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ లీగ్ కోసం మొత్తం 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. టీమ్ డైరెక్టర్‌గా సచిన్ కుమార్ తోమర్, హెడ్ కోచ్‌గా గౌరవ్ కుమార్, అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా రితిక్ శర్మకు బాధ్యతలు అప్పగించారు.
సచ్‌వరల్డ్ స్పోర్ట్స్, లైవ్‌వైర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ మద్దతుతో డోయివాలా కింగ్స్ ఫ్రాంచైజీ ఏర్పడింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ (సీఏయూ) అధికారిక ఆమోదంతో తొలిసారి ఈ టీ20 లీగ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని క్రికెటర్లకు పోటీతత్వంతో కూడిన వేదికను కల్పించడంతో పాటు డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల అభిమానులకు ఉత్కంఠభరితమైన ఫ్రాంచైజీ క్రికెట్‌ను అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో లీగ్‌ను మొదలుపెట్టారు.
మొత్తం ఆరు ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. డోయివాలా కింగ్స్‌తో పాటు సెలాక్వి స్ట్రయికర్స్, రిషికేశ్ డ్రాగన్స్, ముస్సోరి థండర్స్, వికాస్‌నగర్ ధమాక, హెర్బర్ట్‌పూర్ నైట్‌రైడర్స్ ఇందులో ఉన్నాయి.
డోయివాలా కింగ్స్ జట్టు: టీఎన్‌ఆర్ మోహిత్ (కెప్టెన్), దివ్యాన్షు యాదవ్ (వైస్ కెప్టెన్), అవనీష్ సుధా, తనీష్క ఖత్రీ, ముకేశ్ గుప్తా, అశ్వమన్ గులాటీ, అజయ్ యాదవ్, సారంగ్ రావత్, విషు కశ్యప్, ఆకాశ్ సైనీ, ప్రీత్ షిరోహి, శివాన్షు పాండే, అభయ్ దీప్, శుభమ్ సింగ్, శిప్ ప్రతాప్ సింగ్, ఉదయ్, ఆది ఖాన్.
