- షెల్టన్, మెద్వెదెవ్, డిమినుయెర్ కూడా..
- రబ్లెవ్, జోదర్‌కు షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు సాఫీగా ముందంజ వేశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండోసీడ్ కార్లోస్ అల్కరాజ్ 4–6, 6–0, 6–3, 6–2తో జైమే ఫారియా (పోర్చుగల్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. కుడి మణి కట్టు గాయంతో ఆరు నెలలు ఆటకు దూరమైన అల్కరాజ్.. రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. 2 గంటలా 40 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్ చేజారినా.. అద్భుతంగా పుంజుకున్నాడు.
వరుసగా ఎనిమిది గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను తన వైపు తిప్పుకున్నాడు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వరుసగా 16 మ్యాచ్‌ల విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ మొత్తంలో 4 డబుల్ ఫాల్ట్స్, మూడు ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ తన సర్వీస్‌లో 72 శాతం పాయింట్లు రాబట్టాడు. 43 విన్నర్లతో 29 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. 12 బ్రేక్ పాయింట్లలో ఏడింటిని కాచుకున్నాడు. 5 ఏస్‌లు కొట్టిన ఫారియా 11 డబుల్ ఫాల్ట్స్‌తో ఇబ్బందిపడ్డాడు.
ఏడు బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే నిలబెట్టుకున్నాడు. 27 విన్నర్లు, 38 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 6–3, 5–7, 7–6 (7/3), 7–5తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలెండ్)పై, డానియెల్ మెద్వెదెవ్ (రష్యా) 6–1, 6–3, 7–5తో గోర్జానీ (అమెరికా)పై, డిమినుయెర్ (ఆస్ట్రేలియా) 6–2, 6–2, 6–4తో గురెరి (ఫ్రాన్స్)పై, తియాఫో (అమెరికా) 6–3, 7–6 (7/2), 7–5తో సకమోటో (జపాన్)పై, టొమ్మి పాల్ (అమెరికా) 6–2, 6–3, 5–7, 6–4తో డినో ప్రిజ్మిక్ (క్రొయేషియా)పై, మిచెల్‌సెన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో నకషిమా (అమెరికా)పై, సిట్సిపాస్ (గ్రీస్) 6–7 (1/7), 6–3, 7–6 (7/4), 6–4తో లాయిడ్ హారిస్ (సౌతాఫ్రికా)పై, అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్) 6–3, 6–1, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై, రిండర్‌కెంచ్ (ఫ్రాన్స్) 7-–6 (7/4), 6–-2, 7–-5తో మునార్ (స్పెయిన్)పై గెలవగా, మెరిడా (స్పెయిన్) 6–7 (3/7), 6–2, 6–4, 6–4తో రబ్లేవ్ (రష్యా)కు, యున్‌చావోకోటే బు (చైనా) 6–2, 6–1, 6–1తో 12వ సీడ్ జోదర్ (స్పెయిన్)కు షాకిచ్చారు.
వరుస సెట్లలో..
విమెన్స్ సింగిల్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) వరుస సెట్లలో దుమ్మురేపింది. రెండో రౌండ్‌లో 6–1, 6–1తో పోలినా ఇయాట్సెంకో (రష్యా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడిన సబలెంక ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 54 నిమిషాల మ్యాచ్‌లో బెలారస్ ప్లేయర్ సర్వీస్‌లో ఆకట్టుకుంది. 3 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్స్ చేసిన సబలెంక కీలక టైమ్‌లో ఆరు బ్రేక్ పాయింట్లను సాధించింది. 24 విన్నర్లతో హోరెత్తించింది. 16 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసినా.. 73 శాతం నెట్ పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
4 డబుల్ ఫాల్ట్స్ చేసిన పోలినా ఒకే ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుంది. 3 విన్నర్లు సాధించగా, 16 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో వెనకబడింది. దాంతో 26 పాయింట్లకే పరిమితమైంది. ఇతర మ్యాచ్‌ల్లో జెస్సికా పెగులా (అమెరికా) 6–3, 6–1తో కెనిన్ (అమెరికా)పై, కోస్టుక్ (ఉక్రెయిన్) 6–1, 7–5తో స్టీఫెన్స్ (అమెరికా)పై, ముచోవా (చెక్) 6–1, 6–0తో బౌల్టర్ (ఆస్ట్రేలియా)పై, నోస్కోవా (చెక్) 6–4, 6–2తో టారారుడీ (థాయ్‌లాండ్)పై, ఎమ్మా నవారో (అమెరికా) 3–6, 6–2, 6–3తో మెక్‌నల్లీ (అమెరికా)పై, జోవిచ్ (అమెరికా) 7–5, 6–3తో మాగ్దలెనా ఫ్రీంచ్ (పోలెండ్)పై, టాన్సెండ్ (అమెరికా) 6–1, 6–1తో ప్రీస్టన్ (ఆస్ట్రేలియా)పై, పౌలిని (ఇటలీ) 6–4, 6–1తో స్టెఫానినీ (ఇటలీ)పై, లెహెకా (చెక్) 6–4, 6–2, 6–4తో సామ్యూల్ (అమెరికా)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–7 (6/8), 6–4తో జోయింట్ (ఆస్ట్రేలియా)పై, ష్నైడెర్ (రష్యా) 6–1, 7–6 (7/4)తో ప్లిస్కోవా (చెక్)పై, ఫెర్నాండెజ్ (కెనడా) 6–4, 6–1తో సవాంగ్‌క్వా (థాయ్‌లాండ్)పై, కలిన్‌స్కయా (రష్యా) 7–5, 2–6, 6–3తో వాంగ్ (చైనా)పై గెలిచి ముందంజ వేశారు.
