మైనర్లకు ఆన్ లైన్ గేమ్స్.. వారానికి 3 గంటలే

V6 Velugu Posted on Aug 31, 2021

  • శుక్ర, శని, ఆదివారాల్లోనే ఇవ్వాలి
  • ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు చైనా ఆదేశం

షాంఘై: చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లు ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలు అవుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో గేమింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. అంతకుముందు రోజుకు గంటన్నర మాత్రగే గేమ్స్ ఆదే అవకాశం ఇవ్వాలన్న ఉత్తర్వులను సవరించింది. ఇకపై వారానికి 3 గంటలు మాత్రమే పిల్లలకు ఆన్ లైన్ గేమ్స్ అందుబాటులో ఉండాలని.. అవి కూడా వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 
ఆన్‌లైన్‌ చదువులను ఆసరగా చేసుకుని అనేక కంపెనీలు షేర్‌ మార్కెట్‌లో ప్రవేశించి వేల కోట్లను జనం నుంచి వసూలు చేస్తుండడానికి చైనా ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. జాక్‌ మా వంటి వ్యాపారవేత్తలు అనేక ఫిన్‌ టెక్‌ కంపెనీలతో చైనా మార్కెట్‌లో భారీ ఎత్తున నిధులు సేకరించి... మార్కెట్‌పై గుత్తాధిపత్యం చెలాయించడంపై చైనా దృష్టి సారించి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అదేకోవలోనే ఇపుడు చైనా దేశాన్ని  గేమింగ్‌ పరిశ్రమ నియంత్రిస్తుండడం గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్‌ మార్కెట్‌ చైనాలో ఉండడం వల్ల ఇక్కడ మైనర్లు ఆన్ లైన్ గేములకు బానిసలు అవుతున్నారని గుర్తించి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. 
గేమింగ్‌ కంపెనీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించింది చైనా. 
2019లో రోజుకు గంటన్నర మాత్రమే ఆన్ లైన్ గేమింగ్ కు అందుబాటులో ఉంచాలన్న నిబంధనను సవరించింది. ఇకపై వారానికి కేవలం మూడు గంటలు మాత్రమే మైనర్లకు గేమింగ్ ఇవ్వాలని... మిగిలిన సమయాల్లో వారికి అందుబాటులో ఉండకూడదని గేమింగ్‌ కంపెనీలను చైనా ఆదేశాలిచ్చింది. శుక్రవారం, శని, ఆదివారంలో మాత్రమే ఈ మూడు గంటలు అందించాలని,  అలాగే ఇతర పండుగలు, సెలవు దినాల్లో కూడా ఇవ్వొచ్చు కానీ.. టైమైంగ్‌లో ఎలాంటి మార్పు ఉండకూడదని చైనా స్పష్టం చేసింది. 
ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపే ఆదేశాలివ్వడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లో వెంటనే కనిపించింది. చైనాతో పాటు జపాన్‌, హాంగ్‌కాంగ్‌లో లిస్టయిన అనేక గేమింగ్‌ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా క్షీణించాయి. బిలిబిలి కంపెనీ షేర్‌ 7 శాతం, నెట్‌ ఈజీ కంపెనీ షేర్‌ 5 శాతం, టోక్యోలో నెక్సాన్‌ కంపెనీ షేర్‌ 5 శాతం వరకు పడిపోయిగా మిగిలిన కంపెనీల షేర్ల ధరల్లో కూడా డౌన్ ఫాల్ దిశలో నమోదవుతున్నాయి. 
 

Tagged China, Weekends, kids, online games

Latest Videos

Subscribe Now

More News