
బీజింగ్: చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, మరికొన్ని వారాల్లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వం పలు చోట్ల ఆంక్షలు కఠినతరం చేస్తోంది. ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని జియాన్ సిటీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో మొత్తం సిటీని లాక్ డౌన్ చేస్తున్నట్లుగా గురువారం ప్రకటించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. అటు దేశీయంగా విమానాలను రద్దు చేసింది. నిబంధనలను ఎవరూ అతిక్రమించొద్దని ఆదేశాలు జారీ చేసింది. త్వరలో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నందున జియాన్‌తో పాటుగా మరికొన్ని నగరాల్లో కూడా వుహాన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జియాన్‌లోని 1.30 కోట్ల మంది తమ ఇళ్లలోనే ఉండాలని.. అవసరాల కోసం రోజూ ఒక్కరే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించింది.