‘హెచ్3ఎన్8’తో చైనా మహిళ మృతి

‘హెచ్3ఎన్8’తో చైనా మహిళ మృతి
  • ఇప్పటివరకు చైనాలోనే మూడు కేసులు వైరస్​తో ఇదే ఫస్ట్ డెత్

జెనీవా: చైనాలో హెచ్3ఎన్8 ఇన్ ఫ్లుయెంజా ఏ వైరస్ తో ఓ మహిళ మృతిచెందింది. ప్రపంచంలో ఈ వైరస్ కారణంగా నమోదైన ఫస్ట్ హ్యూమన్ డెత్ ఇదేనని, ఇప్పటివరకు చైనాలోనే ముగ్గురికి హెచ్3ఎన్8 వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) వెల్లడించింది. ‘‘చైనాకు చెందిన 56 ఏండ్ల మహిళ తీవ్రమైన న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరింది. వ్యాధి బారిన పడటానికి ముందు కోళ్లకు దగ్గరగా గడపడంతో ఆమెకు కోళ్ల నుంచి హెచ్3ఎన్8 ఇన్ ఫ్లుయెంజా ఏ వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆమె మార్చి 27న చికిత్స పొందుతూ చనిపోయింది” అని డబ్ల్యూహెచ్ వో ఒక ప్రకటనలో తెలిపింది.  హెచ్3ఎన్8 వైరస్ ను 2002లో నార్త్ అమెరికన్ బాతుల్లో కనుగొన్నారు. ఇది గుర్రాలు, కుక్కలు, సీల్స్ కు సోకినట్లు అనేక సార్లు గుర్తించారు. ఈ వైరస్ కోళ్ల నుంచి జంతువులకు వ్యాపించడం సాధారణమేనని, కానీ మనుషులకు సోకడం, ఒకవేళ మనుషులకు సోకినా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి కావడం మాత్రం చాలా అరుదు అని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది.