ఈ చైనా వాళ్లు ఉన్నారే.. స్కర్ట్ మోడల్ లో వెరైటీ ఐస్ క్రీం

ఈ చైనా వాళ్లు ఉన్నారే.. స్కర్ట్  మోడల్ లో వెరైటీ ఐస్ క్రీం

వ్యాపారం.. అంటేనే ఆకర్షణ.. జనాలు  తమ వస్తువులను కొనేలా షాపు యజమానులు అదిరిపోయే ప్రకటనలు ఇస్తుంటారు.  ఇక ఫుడ్ స్టాల్స్ విషయానికొస్తే రోజు కొక వెరైటీ టేస్టీ ఫుడ్ ను అందుబాటులోకి తెస్తారు.  ఇప్పుడు తాజాగా చైనాలో ఓ ఐస్ క్రీం పార్లర్  తయారు చేసిన స్కర్ట్ ఐస్ క్రీం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

ఐస్ క్రీమ్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినే పదార్థం. ఈ ఐస్ క్రీమ్ ను చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఐస్ క్రీమ్ తయారీ సంస్థలు కూడా ప్రజల అభిరుచులకు తగ్గట్టు గానే రకరకాల ఫ్లేవర్స్ తో వీటిని అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నాయి. మిగతా అన్ని కాలాల్లో  ఐస్ క్రీమ్ కు గిరాకీ  ఉంటుంది.

ఇప్పుడు చైనా మార్కెట్లో ఓ కొత్త  ఫ్లేవర్ ఐస్ క్రీం జనాలను ఆకర్షిస్తుంది.  జియాంగ్ ఫ్రావిన్స్ లో ఓ షాపులో అందంగా ఐస్ క్రీములను  తయారు చేస్తున్నారు.  బిస్కట్ కోన్  స్కర్ట్ మాదిరిగా తయారు చేశారు.  ఈ ఐస్ క్రీంను చూసిన జనాలు చర్చ మొదలు పెట్టారు. అలా స్కర్ట్ ఐస్ క్రీం వైరల్ గామారింది. 

మా మియాన్ క్యూన్ అనేది రాజవంశానికి చెందిన సాంగ్. చైనాలో 960-1279 మధ్య సంప్రదాయంగా...  చైనీయుల ( గుర్రం ముఖం మాదిరిగా ఉండే స్కర్ట్స్)  వస్త్రధారణ ఉండేది. ఆ తరువాత క్రమేణ కనుమరుగైంది.  ఇప్పడు  చైనాలోనే డిష్ స్టైల్లో  అలాంటి వస్త్రధారణలో స్కర్ట్ ఐస్ క్రీంను తయారు చేశారు. చైనీస్ సంస్కృతిని గుర్తు చేసుకొని కాపాడేందుకు ఇలాంటి ఐస్ క్రీంను తయారుచేశామని షాపు యజమానులు చెబుతున్నారు. 

చైనీస్ సోషల్ మీడియాలో Xiaohongshu ప్లాట్ ఫాం ద్వారా కొందరు దీనిని పోస్ట్ చేశారు.  ఇది నిజంగా తమాషాగా ఉందని కొందరంటే మరికొందరు అందమైన ఐస్ క్రీం  ( క్వీన్) చూస్తున్నామని కామెంట్ చేశారు.  ఇంకొంతమంది  ఐస్ క్రీంలు గుర్రపు స్కర్ట్ లు ధరించాయని పోస్ట్ చేశారు.