ఇండియాపై నిఘా పెట్టేందుకు హంబన్​టొట పోర్టుకు చైనా నౌక

ఇండియాపై నిఘా పెట్టేందుకు హంబన్​టొట పోర్టుకు చైనా నౌక

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్పై షిప్...శ్రీలంకలోని హంబన్​టొట పోర్ట్​వైపు తన జర్నీ కొనసాగిస్తూనే ఉంది. ఇండియాపై నిఘా పెట్టేందుకు హంబన్​టొట పోర్టుకు చైనా నౌక వస్తున్నదని, దాన్ని రాకుండా ఆపాలని శ్రీలంకను కేంద్రం కోరింది. నౌక రాకను వాయిదా వేయాలని శ్రీలంక సూచించినా చైనా వినిపించుకోవడం లేదు. ‘యువాన్​ వాంగ్​5’ అనే ఈ స్పై షిప్​ బుధవారం ఉదయం 10 గంటలకు ఇండోనేషియాకు ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది.

ఇదే స్పీడ్​తో జర్నీ చేస్తే.. గురువారం రాత్రి 9.30 గంటల కల్లా శ్రీలంకలోని హంబన్​టొట పోర్టుకు చేరుకునే చాన్స్​ ఉంది. నౌకను ట్రాక్​ చేస్తూ వస్తున్న ఇండియన్​ గవర్నమెంట్.. సోమవారమే శ్రీలంక అధికారులకు పరిస్థితి వివరించి ఒత్తిడి తీసుకొచ్చింది. నౌక రాకను వాయిదా వేయాలని చైనా ఎంబసీ అధికారులకు శ్రీలంక కూడా సూచించింది. అయినా చైనా పట్టించుకోవడం లేదు.