పాక్కు జే-35ఏ ఫైటర్ జెట్లు ..2026 నుంచి సరఫరా చేయనున్న చైనా

పాక్కు జే-35ఏ ఫైటర్ జెట్లు ..2026 నుంచి సరఫరా చేయనున్న చైనా
  • చైనాలో ట్రైనింగ్ తీసుకుంటున్న పాకిస్తాన్ పైలట్లు

న్యూఢిల్లీ: పాకిస్తాన్​కు చైనా 40 జే–35ఏ ఐదో జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌‌‌‌‌‌‌‌లను సరఫరా చేయనున్నది. జే–35 ఇండక్షన్, స్టెల్త్ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో పాకిస్తాన్ చేరనున్నది. అయితే, ఇండియన్ ఎయిర్​ఫోర్స్ వద్ద స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు. స్వతహాగా ఐదో జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు మనం తయారు చేసుకోవాలంటే సుమారు పదేండ్ల సమయం పడుతుంది. 2030–2035లో ఇవి అందుబాటులోకి వస్తాయి.  2024, డిసెంబర్​లోనే 40 జే–35 స్టెల్త్ ఫైటర్ జెట్​ల కోసం చైనాకు పాకిస్తాన్ ఆర్డర్ ఇచ్చింది. 

2029 నుంచి ఫైటర్ జెట్ల డెలివరీ ప్రారంభించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2025 ఆగస్టు లేదంటే.. 2026 ప్రారంభంలోనే పాకిస్తాన్​కు చైనా జే–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు డెలివరీ చేయడం షురూ చేయనున్నది.

 గతంలో అంచనా వేసినదానికంటే చాలా వేగంగా సప్లైను చైనా ప్రారంభించనున్నది. పాకిస్తాన్​కు చెందిన పైలట్లు 2024, ఆగస్టు నుంచే చైనాలో ఫైటర్ జెట్​లపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్–16, మిరాజ్ జెట్​ల స్థానాన్ని జే–35ఏ ఫైటర్ జెట్లు భర్తీ చేయనున్నాయి.

ట్విన్ ఇంజన్.. మల్టీరోల్ ఫైటర్

జే–35ఏ.. అనేది షెన్‌‌‌‌‌‌‌‌యాంగ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేస్తున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్లలో జే–35ఏ ఒకటి. పాకిస్తాన్ వద్ద ఇప్పటికే చైనాకు చెందిన 20 జే–10సీ, జేఎఫ్–17 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇటీవల 40 జే–35 స్టెల్త్ ఫైటర్ జెట్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎఫ్​సీ 31 గైర్ ఫాల్కన్ ప్రొటోటైప్​ను ఆధారంగా చేసుకుని తయారు చేస్తున్నారు. మల్టీరోల్ ఫైటర్, ఎయిర్ సుపీరియారిటీ, ప్రెసిషన్ స్ట్రైక్ మిషన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. 

ఇండియాకు ప్రత్యామ్నాయం ఏంటి?

మన వద్ద ఐదో జనరేషన్ ఫైటర్ జెట్లు లేవు. ‘ఆమ్కా’ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను స్పీడప్ చేస్తే తప్ప వాటిని మనం వాడుకలోకి తీసుకురాలేము. 2030కల్లా ఐదో జనరేషన్ ఫైటర్ జెట్​ల తయారీకి కేంద్రం ప్రయత్నిస్తున్నది. అమెరికా నుంచి ఎఫ్ 35 లేదంటే రష్యా నుంచి సుఖోయ్ 57 వంటి ఐదో తరం ఫైటర్‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. డ్రోన్ టెక్నాలజీని బలోపేతం చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ వార్‌‌‌‌‌‌‌‌ఫేర్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలి. అప్పుడే.. పాక్ స్టెల్త్ ఫైటర్‌‌‌‌‌‌‌‌లతో పోరాడే అవకాశం ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

చైనా తయారు చేస్తున్న రెండో స్టెల్త్ ఫైటర్

స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉండి.. అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే (ఏయిసా) రాడార్, సెన్సర్ ఫ్యూజన్, పీఎల్ 17 వంటి లాంగ్ రేంజ్ ఎయిర్ టు -ఎయిర్ మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌ కలిగి ఉంటుంది. సుమారు 17.3 మీటర్ల పొడవు, 11.5 మీటర్ల వింగ్‌‌‌‌‌‌‌‌స్పాన్, 25 నుంచి 28 టన్నుల హయ్యెస్ట్ టేకాఫ్ వేయిట్ కలిగి ఉంటుంది. 

చైనా తయారు చేస్తున్న సెకండ్ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. దీనికి ముందు జే20 అనే స్టెల్త్ ఐదో తరం ఫైటర్ జెట్ ను చైనా తయారు చేసింది. అమెరికా తర్వాత 2 రకాల స్టెల్త్ ఫైటర్​లను కలిగి ఉన్న దేశంగా చైనా నిలుస్తున్నది. కాగా, ఐదో తరం ఫైటర్‌‌‌‌‌‌‌‌లను ఆపరేట్ చేస్తున్న దేశాల్లో అమెరికా, దాని మిత్రదేశాలు (ఎఫ్–-35) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.