చైనా కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ యూఏఈలో జరుగుతున్నాయి. చైనా కు చెందిన ఓ వ్యాక్సిన్ మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా యూఏఈలో జరిగిన మూడో దశ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ సానుకూలంగా ఉన్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు.
ప్రస్తుతం చైనా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
1. మూడో దశలో సానుకూల ఫలితాలని ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ ను చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మా )పరిశోధనలు చేస్తుంది .
2. చైనాకు చెందిన నాలుగు కరోనా వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ 3వ దశలో ఉన్నాయి.
3. సినోఫార్మా మరియు సినోవాక్ బయోటెక్ (యూఎస్ కంపెనీ ) మూడు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. నాలుగో వ్యాక్సిన్ ను కాన్సినో బయోలాజిక్ అభివృద్ధి చేస్తోంది. ఇది చైనా మిలిటరీ వినియోగించుకునేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆమోదం తెలిపారు.
4. చైనా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను యూఏఈ ఇప్పటికే పరీక్షలు నిర్వహించింది. మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ జులైలో ప్రారంభమయ్యాయి.
5. యూఏఈ ఈ వారం ప్రారంభంలో వ్యాక్సిన్ ను అత్యవసర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్ కార్మికులు వినియోగించుకునేలా అనుమతి ఇచ్చింది.
6. చైనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ను యూఏఈ 125 దేశాలకు చెందిన 31వేల మంది వాలంటీర్లపై ప్రయోగించారు. మూడో దశ ట్రయల్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని యూఏఈ అధికారులు తెలిపారు.
