మంకీ బీ వైరస్‌‌‌‌‌‌‌‌ సోకిన చైనా డాక్టర్‌‌‌‌‌‌‌‌ మృతి

మంకీ బీ వైరస్‌‌‌‌‌‌‌‌ సోకిన చైనా డాక్టర్‌‌‌‌‌‌‌‌ మృతి

బీజింగ్‌‌‌‌‌‌‌‌: ఇటీవల మంకీ బీ వైరస్‌‌‌‌‌‌‌‌ సోకిన చైనా వెటర్నరీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ (53) మృతి చెందారు. బీజింగ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆయన.. పనిలో భాగంగా పరిశోధన కోసం ఈ ఏడాది మార్చిలో రెండు కోతుల కళేబరాలను వేరు చేశాడు. ఆ కొద్దిరోజులకే వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొందుతూ మే 27న మరణించారు. ఆయన మృతదేహాన్ని పరీక్షించి మంకీ బీ వైరస్‌‌‌‌‌‌‌‌ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చైనాలో మంకీ బీ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఆయనేనని అక్కడి మీడియా వెల్లడించింది. మంకీ బీ వైరస్‌‌‌‌‌‌‌‌ సోకితే చనిపోయే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వైరస్‌‌‌‌‌‌‌‌ను తొలిసారి1932లో మకాక్ రకం కోతుల్లో గుర్తించారు.