ఆ చిన్నారులు పుడుతూనే లక్షలు సంపాదిస్తున్నారు.. ఎలాగంటే..

ఆ చిన్నారులు పుడుతూనే లక్షలు సంపాదిస్తున్నారు.. ఎలాగంటే..

ఆదాయం బెత్తెడు.. ఖర్చు బారెడు... అన్న చందంగా ఉన్న ఈ రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు ప్రస్తుత యువత.  కొంతమంది అయితే ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు.  దీంతో ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గి .. వృద్ద జనాభా పెరిగిపోతుంది.  ఈ తరుణంలో కొన్ని దేశాలు జనభాను పెంచుకొనేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నాయి. చైనాలో పిల్లలను కనే ఉద్యోగస్తులకు  ఓ కంపెనీ రూ. 5లక్షలను బోనస్ గా ఇస్తామని ప్రకటించింది.  దీంతో ఇంకేముంది చైనా యవత పిల్లలను కనేపనిలో పడ్డారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

యువత లేక అల్లాడుతున్న దేశాలు

 చైనా, జపాన్‌తో సహా అనేక దేశాల్లో జననాల రేటు తగ్గిపోవడంతో వృద్ధ జనాభా పెరుగుతోంది.  యువ శక్తి లేక అనేక దేశాలు అల్లాడుతున్నాయి. అయతే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి.  తాజగా చైనాలోని ఓ ట్రావెల్ కంపెనీ తన ఉద్యోగుల కోసం అత్యంత ప్రత్యేకమైన ఆఫర్‌ను అందించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన ట్రిప్.కామ్ కంపెనీ.. జూలై 1 నుండి, పిల్లలకు జన్మనిచ్చే ఉద్యోగులందరికీ 50 వేల యువాన్లు అంటే సుమారు 5.66 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయంచింది. జననాల రేటును పెంచేందుకు ఇలా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.  కంపెనీ నిర్ణయంతో ఉద్యోగులు సంబరపడిపోతున్నారంట.

 ట్రిప్.కామ్ కంపెనీ బంపరాఫర్

ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయాలని తాను ఎప్పుడో సూచించానని  ట్రిప్.కామ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జేమ్స్ లియాంగ్ తెలిపారు. ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా సౌకర్యాలు, ముఖ్యంగా డబ్బు ఇవ్వాలన్నారు..దీంతో యువత మరింత ఎక్కువ మంది పిల్లలను కనాలనే కోరిక కలిగి ఉంటారు. ఇందులో ప్రైవేట్ కంపెనీలు తమ వంతుగా తప్పకుండా పాల్గొంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా  ఉన్న  ట్రిప్.కామ్ కంపెనీ..ఉద్యోగులకు జన్మించిన ప్రతి బిడ్డకు 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 10,000 యువాన్లు ఇవ్వాలని తాము నిర్ణయించుకున్నామని, ఇది తల్లిదండ్రుల సబ్సిడీ కింద ఉంటుందని జేమ్స్ లియాంగ్ తెలిపారు. దీని కోసం కంపెనీ 1 బిలియన్ యువాన్ ఖర్చు చేయబోతోందన్నారు.

చైనాలో వృద్ధాప్యం

చైనాలో 1980 నుండి 2015 వరకు ఒక బిడ్డ విధానాన్ని అనుసరించారు. దీని కారణంగా శ్రామిక శక్తి క్రమేణా తగ్గుతోంది. వృద్ధులపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చైనా జననాల రేటు 2022లో 7.52 నుండి 1,000 మందికి 6.77కి పడిపోయింది. ఇదొక రికార్డు. దీంతో మరోసారి రూల్స్ మార్చింది. చైనా దంపతులు గరిష్టంగా ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇంత జరుగుతున్నా యువత సంతానం పట్ల ఆసక్తి చూపడం లేదు. అందుకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించింది. పిల్లల సంరక్షణ, చదువు తమ అదుపులో ఉండవని యువత భావిస్తోంది.

మూడో బిడ్డపై 11.50 లక్షల రూపాయలు

ఇంతకుముందు, చైనాకు చెందిన టెక్ కంపెనీ బీజింగ్ దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ మూడవ బిడ్డను కనడం కోసం తన ఉద్యోగులకు 90 వేల యువాన్లు అంటే సుమారు 11.50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 9 నెలల సెలవులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు 12 నెలల సెలవులు ఇవ్వాలని చర్చ జరిగింది. చైనాలో బేబీ బోనస్, పొడిగించిన పెయిడ్ లీవ్స్, పన్ను మినహాయింపు, పిల్లల పెంపకానికి సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.