చైనా లోన్​ యాప్స్​ రూ. 46.67 కోట్ల నగదు ఫ్రీజ్

చైనా లోన్​ యాప్స్​ రూ. 46.67 కోట్ల నగదు ఫ్రీజ్

చైనా రుణ యాప్ లపై ఈడీ కొరడా ఝులిపించింది. రోజర్ పే, క్యాష్ ఫ్రీ, ఈజ్ బజ్, పేటీఎంల ఆన్ లైన్ పేమెంట్ గేట్ వేల ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన రూ. 46.67 ఖాతాల నిధులను స్తంభింప చేసింది. రుణాలిచ్చి వేధింపులకు పాల్పడుతుండడంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఆయా రుణ యాప్ లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది.

యాప్ లతో పాటు యాప్ లలో వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం పొందొచ్చని ప్రచారం చేసి భారీగా పెట్టుబడులు స్వీకరించిన ఇన్వెస్ట్ మెంట్ టోకన్లపైనా ఈడీ దాడులు చేసింది. రోజర్ పే, క్యాష్ ఫ్రీ, ఈజ్ బజ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబాయి, లక్నో, గయ, ఘజియాబాద్ లతో పాటు హైదరాబాద్ బెంగళూరు, చెన్నై, జైపూర్ లలో బ్యాంకులు, పేమెంట్ గేట్ వేలకు చెందిన 16 సముదాయాలపై తనిఖీలు నిర్వహించారు. వీటికి సంబంధించి మొత్తంగా రూ. 46.67 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.