
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడి వలకు లోయర్ మానేరు డ్యామ్ లో శనివారం వెండి చేప చిక్కింది. 20 కిలోల బరువుతో ఎరుపు రంగులో ఈ చేప వెరైటీగా ఉండడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఇలాంటి చేప ఇప్పటివరకు ఎల్ఎండీ రిజర్వాయర్ లో కనిపించలేదని జాలరులు తెలిపారు.
జిల్లా మత్స్యశాఖాధికారి విజయ భారతిని సంప్రదించగా, ఈ చేపను సిల్వర్ కార్ప్(వెండి చేప) అని పిలుస్తారని తెలిపారు. చైనా దేశీ రకానికి చెందిన ఈ చేప సైంటిఫిక్ పేరు హైపోఫ్తాల్మిచ్తిస్ మోలిట్రిక్స్ అని చెప్పారు.