తైపీ సిటీ: ఇండియా షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. చైనీస్ తైపీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడోసీడ్ ప్రణయ్ 21–11, 21–14తో మినోరు కోగా (జపాన్)పై గెలిచాడు. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో కేవలం 35 నిమిషాల్లోనే ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 21–10, 21–18తో వాంగ్ పో వీ (చైనీస్‌తైపీ)పై, తరుణ్ మన్నెపల్లి 21–12, 21–15తో జియోన్ హోయెక్ జిన్ (కొరియా)పై గెలవగా, రౌనక్ చౌహాన్ 14–21, 16–21తో రిచీ డుటా రికార్డో (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.
విమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21–12, 21–18తో పెయ్ యు వాంగ్ (చైనీస్‌తైపీ) గెలిచింది. దేవిక సిహాగ్ 14–21, 21–7, 21–15తో గా యున్ పార్క్ (కొరియా)పై, తన్వీ 21–16, 22–20తో తస్మిన్ మిర్‌పై, అన్మోల్ ఖర్బ్ 21–15, 11–21, 21–19తో ఇషికా జైస్వాల్‌పై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.
