ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నా రెడ్డి బాధ్యతలు

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నా రెడ్డి బాధ్యతలు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా డా.చిన్నా రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ ప్రజావాణి ఆఫీస్​లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించటానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా డా. చిన్నా రెడ్డిని నియమించింది.