V6 News

కాకాజీ లుక్ టెస్ట్.. బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ స్టార్ట్

కాకాజీ లుక్ టెస్ట్.. బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ స్టార్ట్

ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో ఆడియెన్స్‌‌‌‌ను అలరించిన చిరంజీవి ప్రస్తుతం ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. బాబీ కొల్లి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేస్తున్నారు. కేవీఎన్  ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ  భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ  చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌‌‌‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌‌‌‌లో  కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈచిత్రంలో  చిరంజీవి కొత్త షేడ్‌‌‌‌లో కనిపించనున్నట్లు పోస్టర్ హింట్ ఇచ్చింది.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై  అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌ రూపొందించే బాబీ.. మరోసారి మెగాస్టార్ కోసం  మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌ను డిజైన్ చేశాడట.  చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌‌‌‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమవుతుందని మేకర్స్ తెలియజేశారు. 

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను ప్రకటిస్తామన్నారు.  మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా  త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానుంది.  అలాగే ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌‌‌లోనూ చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అవగా ఈ ఏడాది ఎండింగ్‌‌‌‌లో  ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.