విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి సపోర్ట్

విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి సపోర్ట్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవులో మార్మోగుతున్నాయన్నారు. నర్సాపురం వైఎన్ ఎం కాలేజీలో చదివే రోజుల్లో విశాఖ ఉక్కు సాధిస్తామనే నినాదాన్ని గోడల మీద రాశామని గుర్తు చేశారు. ధర్నాలు,రిలేనిరాహార దీక్షలు చేశామన్నారు. దాదాపు 35 మందితో పాటు తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలర్పించి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభమైనపుడు డు సంబరాలు చేసుకున్నామన్నారు. కేవలం నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. లక్షలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు.ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామన్నారు.