
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. విద్యావేత్తగా మారబోతున్నారని, అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో స్థాపించిన సంస్థకు..చిరంజీవికి గానీ, ఆయన కుమారుడు రాంచణ్ కు, నాగబాబుకు గానీ ఎటువంట ి సంబంధం లేదన్నారు మెగా మిత్రుడు సీఈఓ జే శ్రీనివాస్ రావు.
చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పథంతో, సామాజిక సృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో సంస్థ స్థాపించి..దిగువ తరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలని ఈ స్కూల్ ను స్థాపించామన్నారు. అయితే మెగా కుంటుంబం పై ఉన్న అభిమానంతో చిరంజీవిని, రాంచరణ్, నాగబాబు లను గౌవర ఫౌండర్ గా, గౌరవ అధ్యక్షులుగా, గౌరవ ఛైర్మన్ గా నియమించుకున్నామన్నారు.
అయితే ఇందులో చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధలేదని తెలిపారు. ఈ స్కూల్ ను మొదట శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు శ్రీనివాస్ రావు.