గుమ్మడికాయ కొట్టేసిన భోళాశంకర్

గుమ్మడికాయ కొట్టేసిన భోళాశంకర్

‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతి సక్సెస్‌‌ను అందుకున్న చిరంజీవి.. ఆరు నెలల్లో మరో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌‌‌‌’. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌కు గుమ్మడికాయ కొట్టేశారు. షూట్ పూర్తయిన విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్‌‌ తెలియజేస్తూ.. మెగాస్టార్ తో కలిసి ఉన్న ఫొటోలను ట్వీట్ చేశాడు.  పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డ నటీనటులు, టెక్నీషియన్స్‌‌కు థ్యాంక్స్ చెప్పాడు. 

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్‌‌ స్వింగ్‌‌లో జరుగుతోందని, త్వరలోనే ప్రమోషన్‌‌ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని అన్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది.