జగన్ కు మద్దతు తెలిపిన చిరు..నో చెప్పిన పవన్

జగన్ కు మద్దతు తెలిపిన చిరు..నో చెప్పిన పవన్

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయంపై  జగన్ కు మద్దతు తెలిపారు చిరంజీవి. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో  సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జగన్ కు మద్దతుగా ఓ లేటర్ రిలీజ్ చేశారు చిరంజీవి. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..ఇంకో లక్ష కోట్లతో అమరావతి నిర్మిస్తే ఉత్తరాంధ్ర,రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. అమరావతి- శాసన నిర్వాహక, విశాఖ- కార్యనిర్వాహక, కర్నూలు – న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరూ స్వాగతించాల్సిందిగా కోరారు చిరంజీవి.

అయితే  మూడు రాజధానులను పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్న ఓక్క రాజధానికే దిక్కు లేదు కానీ మూడు రాజధానులు ఎప్పుడు కడతారంటూ జగన్ పై సెటైర్లు కూడా వేశారు పవన్. కేబినెట్ నిర్ణయం  తర్వాత జనసేన నిర్ణయం చెబుతామంటూ పవన్ లేటర్ రిలీజ్ చేశారు.  ఓ వైపు జగన్ నిర్ణయాన్ని పవన్  తీవ్రంగా  వ్యతిరేకిస్తుంటే..చిరంజీవి జగన్ కు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానులపై చిరంజీవిది జగన్ దారి అయితే ..పవన్, నాగబాబుది ఒక దారి. ఇపుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో అటు మెగా ఫ్యాన్స్ లోనూ అయోమయం నెలకొంది.