బాక్సాఫీస్ వద్ద సైరా సందడి : 5రోజుల కలెక్షన్ ఎంతంటే

బాక్సాఫీస్ వద్ద సైరా సందడి : 5రోజుల కలెక్షన్ ఎంతంటే

బాక్స్ ఫీస్ వద్ద  సైరా, వార్, జోకర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. దసరా సీజన్ అవ్వడం, అందులోనూ భారీ తారగణం ఉండడంతో రికార్డుల కలెక్షన్ల వేటలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వసూళ్ల పరంగా చూస్తే జోకర్ హవా కొనసాగుతుంది. ఇక అక్టోబర్ 2న విడుదలైన వార్ , సైరాలు బాక్సాఫీస్ వసూళ్లు బాగున్నా జోకర్ దెబ్బతో అవి కాస్త మందగించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సైరా మూవీ ఐదు రోజుల్లో రూ.155 కోట్ల గ్రాస్ తో దుమ్ముదులిపేస్తుండగా హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా నాలుగు రోజుల్లో 123.60కోట్లను వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. సౌత్ లో ఈ సినిమా నాలుగు రోజుల్లో 5.25కోట్లు రాబట్టగలిగింది.