భీమ్లా నాయక్ పై చిరు ట్వీట్..

భీమ్లా నాయక్ పై చిరు ట్వీట్..

ఇవాళ రిలీజ్ అయిన పవన్  భీమ్లా నాయక్  పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరోసారి  తన అభిమానులకు పవన్ పవర్ ఫుల్ ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. పవన్ రానాల నటన, వారి మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి భీమ్లానాయక్ పై ట్వీట్ చేశారు. పవన్ రానాలతో దిగిన ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి..‘ భీమ్లా నాయక్ తిరుగు లేని విజయం అందుకున్నందుకు  హృదయపూర్వక అభినందనలు. ఇది నిజంగా పవర తుఫానే’ అంటూ ప్రశంసించారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది..