వీరయ్యగానే వస్తారట..

వీరయ్యగానే వస్తారట..

స్టార్ హీరో సినిమా అనగానే ఏం టైటిల్ పెడతారోనని ఆసక్తిగా చూస్తుంటారంతా. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ, అందరినీ ఊరిస్తూ, ఏదో ఒక స్పెషల్ అకేషన్ చూసి టైటిల్ ను రివీల్ చేస్తుంటారు మేకర్స్. అయితే ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా ఒక్కోసారి లీకైపోతుంటాయి. చిరంజీవి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆయన హీరోగా బాబి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వాల్తేరు వీరయ్య’ అనేటైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెట్టినట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతంలో కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శేఖర్ ఈ టైటిల్ ను పొరపాటున రివీల్ చేశాడు. దాంతో ఈ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మారుస్తున్నారంటూ మరో కొత్త వార్త వచ్చింది. రకరకాల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని, ఈ మూవీకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారని తేలిపోయింది.

రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ వేడుకలో పాల్గొన్న చిరంజీవి నోటి నుంచి ఈ పేరు బైటికి రావడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. గతంలో ‘ఆచార్య’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా ఇలానే రివీల్ చేశారు చిరు. ఏదేమైనా ఈ మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్ ఇప్పటికే అభిమానుల నోళ్లలో నానుతోంది కాబట్టి దాన్నే ఉంచేయడంలో తప్పు లేదు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా గురించి క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఒకటి ఇవ్వనున్నట్టు ఇటీవల ప్రకటించింది కూడా. బహుశా టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రివీల్ చేయడం గురించే అయ్యుంటుంది అంటున్నారంతా. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది. చిరుకి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తోంది. కేథరీన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.