హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన మరిది పవన్ కల్యాణ్‌కు చిరంజీవి భార్య సురేఖ విలువైన పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. లగ్జరీ పెన్ బ్రాండ్ మౌంట్ బ్లాక్ పెన్ ను శనివారం హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో పవన్ కు ఆమె అందజేశారు. దీని ఖరీదు లక్షల్లో ఉంటుందని సమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియోను నటుడు చిరంజీవి ట్విటర్ లో షేర్ చేశారు. “కల్యాణ్ బాబుకు వదినమ్మ గిఫ్ట్” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు మహిళా అభిమాని కళ్లజోడు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఓ టీడీపీ మహిళా అభిమాని కళ్లజోడు గిఫ్ట్ గా ఇచ్చింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు.. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తనతో ఫొటో దిగేందుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని చంద్రబాబుకు కళ్లజోడు గిఫ్ట్ గా ఇచ్చింది. దానిని పెట్టుకోవాలని కోరగా.. బాబు ఆ కళ్లజోడు పెట్టుకున్నారు.