హైదరాబాద్, వెలుగు: టెన్త్ క్వశ్చన్ పేపర్లలో చాయిస్‌లు పెంచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు కోరారు. శనివారం ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు. రెండు పేపర్లను ఒక్క పేపర్‌కు కుదించి 2, 3 మార్కుల ప్రశ్నలకు చాయిస్ లేకుండా చేశారని, చాయిస్‌లను 30 శాతం పెంచాలని కోరారు.
సెలవు రోజుల్లో క్లాసులొద్దు
సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రి సబితారెడ్డిని హెడ్‌మాస్టర్ల సంఘం స్టేట్ కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారం సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగాధర రెడ్డి మంత్రికి వినతి పత్రం అందజేశారు. సెలవు రోజుల్లో క్లాసుల వల్ల స్టూడెంట్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.