
గంగాధర, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను సీఎంతో చర్చించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధికి, గంగాధర మండలంలోని నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.