పెట్రోల్ రేట్లపై ఎమ్మెల్యే వెరైటీ నిరసన

పెట్రోల్ రేట్లపై ఎమ్మెల్యే వెరైటీ నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్. అసెంబ్లీలో కూడా పలు పార్టీ నేతలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వెరైటీగా నిరసన తెలిపారు. రోడ్లపై సైకిల్ తొక్కుతూ ఎమ్మెల్యే తన నిరసన వ్యక్తం చేశారు.  సైకిల్ పై వెళ్తున్న ఎమ్మెల్యేను పలువురు కార్యకర్తలు, అభిమానులు బైక్ పై వస్తూ ఫాలో అయ్యారు. 

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.10, డీజిల్‌ రూ95.40పైసలకు చేరింది.