
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన.. ఎంతో మంది గొప్ప డాన్సర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
అయితే తాజాగా రాకేష్ మాస్టర్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అదేంటంటే.. రాకేష్ మాస్టర్ తన చావును ముందే పసిగట్టాడంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాకేష్ మాస్టర్, జూనియర్ రాకేష్ మాస్టర్ (పుల్లయ్య)తో మాట్లాడుతూ.. " నా శరీరంలో మార్పులు నాకు తెలుస్తున్నాయి.. నాకు తెలుసు నేను అస్తమించే సూర్యుడిని.. నువ్వు ఉదయించే సూర్యుడివి, నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు.
ప్రస్తుతం రాకేష్ మాస్టర్ మాట్లాడిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు.. చాలా బాధగా ఉంది మాస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.