వీర్లపల్లి శంకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

వీర్లపల్లి శంకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి : చౌలపల్లి  ప్రతాప్ రెడ్డి

షాద్​నగర్, వెలుగు : షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కోరారు. సోమవారం  ఉమ్మడి కొత్తూరు, నందిగామ మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని కొత్తూరులో నిర్వహించారు. చీఫ్ గెస్టులుగా వీర్లపల్లి శంకర్, ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ పాల్గొన్నారు. టీడీపీ నందిగామ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి 200 మంది అనుచరులతో  కాంగ్రెస్​లో చేరారు.

 ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించాలన్నారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు బృందాలుగా ఏర్పడి కష్టపడి పనిచేయాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి శంకర్​ను గెలిపించాలన్నారు. అంతకుముందు కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు వీర్లపల్లి శంకర్ తరఫున ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.