Chris Woakes: వోక్స్ కెరీర్ ముగించిన ఇండియా టెస్ట్ సిరీస్.. 15 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్!

Chris Woakes: వోక్స్ కెరీర్ ముగించిన ఇండియా టెస్ట్ సిరీస్.. 15 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్!

ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు తాను గుడ్ బై చెబుతున్నట్టు వోక్స్ సోమవారం (సెప్టెంబర్ 29) తన నిర్ణయాన్ని అధికారికంగా తెలిపాడు. 15 ఏళ్లుగా ఇంగ్లాండ్ జట్టులో కొనసాగిన వోక్స్ 36 ఏళ్ళ వయసులో వీడ్కోలు తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ ప్రకటించిన యాషెస్ జట్టులో వోక్స్ కు చోటు దక్కలేదు. ఈ కారణంగానే వోక్స్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు సమాచారం. 

"సమయం ఆసన్నమైంది, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం అని నేను నిర్ణయించుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లాండ్ తరఫున ఆడాలని కలలు కనేవాడిని. ఆ కలలను నిజం చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది".   భావిస్తున్నాను. ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 15 సంవత్సరాలుగా సహచరులతో మైదానాన్ని పంచుకోవడం చాల గర్వంగా ఉంది. వీరిలో చాలా మంది నా లైఫ్ టైం ఫ్రెండ్స్ గా మారారు. నేను చాలా గర్వంగా గుర్తుచేసుకునే విషయాలు ఇవి". అని వోక్స్ రిటైర్మెంట్ తర్వాత తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చాడు. 

క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ తరపున 62 టెస్టుల్లో 192 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ రాణించి ఒక సెంచరీతో సహా 2,034 పరుగులు చేశాడు.  వన్డే కెరీర్ విషయానికి వస్తే 122 మ్యాచ్ ల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 33 టీ20ల్లో 31 వికెట్లు ఈ ఇంగ్లాండ్ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ 2019 వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో వోక్స్ సభ్యుడు. 2022 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ గా నిలవడంతో వోక్స్ కీలక పాత్ర పోషించాడు. 

2023 యాషెస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కాంప్టన్-మిల్లర్ పతకాన్ని గెలుచుకోవడం ఈ ఇంగ్లాండ్ పేసర్ కెరీర్ లో హైలెట్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఫ్రాంచైజ్ లీగ్‌లలో కొనసాగే అవకాశం ఉంది. వార్విక్‌షైర్ తో పాటు ఇతర ఫ్రాంచైజ్ లీగ్‌లలో ఆడే ఛాన్స్ ఉంది. ఓవల్‌లో ఇండియాతో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో వోక్స్ గాయపడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా వోక్స్ ఎడమ భుజానికి గాయమైంది.

బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఫోర్ ఆప్ క్రమంలో ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ కు తీవ్ర గాయమైంది. దీంతో గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ టెస్టులో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే జట్టుకు అవసరమైనప్పుడు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తొమ్మిదవ వికెట్ పడిపోయినప్పుడు ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి జట్టు కోసం తన పట్టుదలను చూపించాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయడంతో వోక్స్ ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన యాషెస్ కు దూరమయ్యాడు.     

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chris Woakes (@chriswoakes)