
ఓవల్ లో టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టుకు ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లోని ఐదో టెస్టుకు వోక్స్ దూరం అవుతున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం (ఆగస్టు 1)న ప్రకటించింది. 2వ రోజు ఆటకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక బంతులు వేసిన వోక్స్.. ఐదో టెస్ట్ లో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని భుజానికి బలమైన దెబ్బ తగిలింది. ఇండియా ఇన్నింగ్స్ 57వ ఓవర్ లో ఏ సంఘటన జరిగింది.
జామీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్ ఐదో బంతికి కరుణ్ నాయర్ కొట్టిన షాట్ ను బౌండరీ ఆపే క్రమంలో వోక్స్ కు భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో భుజాన్ని పట్టుకొని గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ సీమర్ గస్ అట్కిన్సన్ విలేకరుల సమావేశానికి వచ్చి, వోక్స్ మిగిలిన ఐదో టెస్టుకు దూరమవుతున్నాడని సూచించాడు. ది ఓవల్‌లోని పరిస్థితులు వోక్స్ బౌలింగ్ శైలికి అనుగుణంగా ఉంటాయి. కానీ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లేనందున ఇంగ్లాండ్ కు ఎదురు దెబ్బే అని చెప్పాలి. వోక్స్ దూరం కావడంతో ఇంగ్లాండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతోనే మిగిలిన టెస్ట్ ఆడనుంది.
ALSO READ : తొలి టెస్టులో బ్యాటింగ్ లో రాణించిన న్యూజిలాండ్
అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్ ఇంగ్లాండ్ పేసర్లతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్లు జో రూట్, జాకబ్ బెథెల్ బౌలింగ్ ఆప్షన్స్ ఇంగ్లాండ్ కు ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఆఖరిదైన ఐదో టెస్ట్‌లో ఇండియాకు శుభారంభం లభించలేదు. ఇంగ్లిష్ పేసర్లు చేసిన ముప్పేట దాడిలో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. కరుణ్ నాయర్ (52 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (38) మోస్తరుగా ఆడటంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 204/6 స్కోరు చేసింది.
JUST IN: Chris Woakes has been ruled OUT of the fifth #ENGvIND Test, at this stage.
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
He will be monitored through the match. pic.twitter.com/ylMLO9GAeC